అమ్మవారి సేవలో ప్రముఖులు
చంద్రగిరి: పద్మావతి అమ్మవారిని శనివారం పలు వురు ప్రముఖులు దర్శించుకున్నారు. మైసూరు కు చెందిన శ్రీయోగనందేశ్వర సరస్వతి మఠం పీ ఠాధిపతి శ్రీశంకర భారతీ మహాస్వామీజీ, తెలంగాణ రాష్ట్రం సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారులు స్వాగతం ప లికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆ శీర్వచనం పలికారు. ఆలయ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, ప్రసాద్ పాల్గొన్నారు.
17 నుంచి పురందరదాసు ఆరాధనోత్సవాలు
తిరుమల:పురందరదాసు ఆరాధనోత్సవాలు టీటీ డీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనున్నాయి. ఈనెల 17న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్టి, వివిధ పీఠాధిపతుల మంగళ శాసనాలు, సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు ప్రముఖ పీ ఠాధిపతులు మంగళా శాసనాలు అందిస్తారు. ఈ నెల 18న ఉదయం 6 గంటలకు అలిపిరి వద్ద పు రందరదాసు విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తా రు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవా రి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దా స సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. చివరిరోజు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భ జన, నగర సంకీర్తన, ఉపన్యాసాలు, సంగీత వి భావరి నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు పాపవినాశనం రోడ్డులోని కళ్యాణమస్తు వే దికపై వేంకటేశ నవరత్న సంకీర్తన జరుగుతుంది.
18 నుంచి అధ్యయనోత్సవాలు
తిరుపతి కల్చరల్ : గోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు, సేనాధిపతి, ఆళ్వార్లను వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం చేపట్టనున్నారు. అలాగే ఈ నెల 28న చిన్న శాత్తుమొర, ఫిబ్రవరి 3న ప్రణయకలహ మహోత్సవం, 7న పెద్ద శాత్తుమొర జరిపించనున్నారు. చివరి రోజున తన్నీర్ అముధు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.


