నిదురపో.. హాయిగా.. 

Tribal Mothers Farming With Child Araku Valley - Sakshi

విశాఖపట్నం: మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గిరిజన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చంటి బిడ్డలను తమతోపాటే తల్లులు తీసుకువెళ్లి.. ఓ వైపు పనులు చేస్తూనే వారిని సాకుతూ మాతృత్వపు మమకారం చాటుతున్నారు. పంట భూముల్లోనే వారిని లాలించి.. నిద్రపుచ్చే దృశ్యాలు మన్యం అంతటా కనిపిస్తున్నాయి.

హుకుంపేట–అడ్డుమండ ప్రధాన రహదారి గడ్డిమర్రి సమీపంలో చోడినారు సేకరణలో తల్లిదండ్రులు బిజీగా ఉండగా.. దగ్గరలోనే చిన్నారులు చీర ఊయల, గొడుగు కింద నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. (క్లిక్: మన్యం అందం.. ద్విగుణీకృతం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top