జగన్‌ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర | Tobacco prices rise with Jagans visit | Sakshi
Sakshi News home page

జగన్‌ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర

Aug 8 2026 4:59 AM | Updated on Aug 8 2026 4:59 AM

Tobacco prices rise with Jagans visit

హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న రైతులు 

వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

దేవరపల్లి: పొగాకు మార్కెట్‌లో ధరలో పెరుగుదల కనిపించింది. కిలోకు ఒక్కసారిగా రూ.15లు ఎగబాకింది. ఇదంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమేనని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ తమ సమస్యలను ప్రస్తావించడంతోనే ప్రభు­త్వం ధర పెంచిందని పేర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ అధినే­త, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు­గోదా­వరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 5వ తేదీన పర్యటించి పొగాకు రైతులకు బాసటగా నిలిచారు. 

పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడంతోపాటు రైతులు కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గిట్టుబా­టు ధర ఇచ్చే విధంగా పోరాటం చేయాలని రైతులు కోరారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పొగాకు మార్కెట్‌లో ధరల పెరుగుదల... 
జగన్‌ పర్యటన అనంతరం రెండు రోజులకే పొగాకు మార్కెట్‌లో   ధరలు పెరిగాయి. కిలోకు రూ.15లు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కిలో గరిష్ట ధర రూ.275 ఉండగా, శుక్రవారం రూ.290 పలికింది. జగనన్న పర్యటన ప్రకటన వెలువడిన మరుసటి రోజు కిలోకు రూ.10 ధర పెరిగిందని, అప్పటి వరకు కిలో గరిష్ట ధర రూ.265 ఉండగా రూ.275కు పెరిగిందని తెలిపారు. పర్యటన అనంతరం కిలోకు రూ.15 పెరిగినట్టు చెబుతూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న పర్యటన వల్ల కిలోకు మొత్తంగా రూ.25లు అదనపు ధర లభించినట్టయిందని తెలిపారు.  

పొగాకు రైతుల హర్షాతిరేకాలు 
పొగాకు ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, పొగాకు రైతులు సుంకర గంగరాజు, బాలం చంద్రశేఖర్, కవల సత్తిబాబు, పైడికొండల సత్యనారాయణ, కవల శ్రీనివాస్, తేతల బ్రహ్మరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, తేతల వీరకాశీరెడ్డి, పప్పు ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement