భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు | Massive IAS Officers Transfer in Andhra Pradesh: Chief Secretary Issues Orders | Sakshi
Sakshi News home page

భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

Aug 8 2026 4:51 AM | Updated on Aug 8 2026 11:42 AM

Massive transfers of IAS officers

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 16 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ, ఏడుగురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ (సర్వీసెస్‌) ఎస్‌ఎస్‌ రావత్‌ను పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌గా బదిలీ చేశారు. అదనంగా యువజన సర్వీసుల శాఖతోపాటు అదనంగా జీఏడీ సర్వీసెస్, జీపీఎం అండ్‌ ఆర్‌ బాధ్యతలు ఇచ్చారు. 

జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) జె. శ్యామలరావుకు విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు.  ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ, జీఏడీ–పొలిటికల్‌ బాధ్యతలు అదనంగా అప్పజెప్పారు. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ను రవాణా శాఖ కార్యదర్శిగా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న నలుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన అధికారుల్లో ముగ్గురికి పోస్టింగ్‌ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు www.sakshi.com చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement