రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయం.. | YSRCP team meets National SC Commission Chairman in Tirupati | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయం..

Aug 8 2026 4:49 AM | Updated on Aug 8 2026 4:49 AM

YSRCP team meets National SC Commission Chairman in Tirupati

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్‌ రాజ్యాంగం  

బాబు పాలనలో దళితులపై నిత్యం దాడులు, లాకప్‌డెత్‌లు, కేసులు 

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌కు దళితుల సమస్యలను వినే ఓపిక లేకపోవడం దారుణం 

వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, దళిత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు  

తిరుపతిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ బృందం 

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన నేతలు 

తిరుపతి సిటీ: ‘రాష్ట్రంలో దళితుల జీవనం దయనీయంగా మారిందని, నిత్యం దాడులు, బెదిరింపులు, లాకప్‌డెత్‌లతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాలరాస్తూ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. అయినా కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు. దళితులపై దాడులను సోదాహరణంగా వివరిస్తూ పలుమార్లు ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్‌కు వినతిపత్రాలు ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత ప్రజాప్రతినిధులు మేరుగు నాగార్జున, నందిగం సురేష్, కె. నారాయణ స్వామి, ఆదిమూలం సురేష్, సుధాకర్‌బాబుతో పాటు పార్టీ నేత అంబటి మురళీకృష్ణ తదితరులు శుక్రవారం తిరుపతి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానాను కలిశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలను విన్నవించారు. నల్ల బ్యాడ్జిలు దర్శించి నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

జాతీయ ఎస్సీ కమిషన్‌ తక్షణం స్పందించాలి 
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, లాకప్‌ డెత్‌లు, అక్రమ కేసులపై తక్షణం స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను కోరినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. దళితుల సమస్యలపై ప్రజా ప్రతినిధుల వినతులను కనీసం 5 నిమిషాల పాటు వినే పరిస్థితిలో చైర్మన్‌ లేకపోవడం బాధ కలిగించిందన్నారు. పేదల ఇళ్ల కూల్చివేతలు, దాడులు, లాకప్‌ డెత్‌ల వంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగడంలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించే దళితులపై దాడులు చేయడం, హింసించడం, పోలీస్‌ స్టేషన్లలో హత్యలు చేయడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

జాతీయ ఎస్సీ కమిషన్‌ అధికార పార్టీకి వంతపాడుతోంది తప్ప పేద దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్నారు. దళితులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అండగా ఉండడాన్ని చంద్రబాబు జీరి్ణంచుకోలేక పోతున్నారని చెప్పారు. బాబు సర్కారు పోలీసు వ్యవస్థను అ«దీనంలోకి తీసుకుని ఎంతోమంది దళితులను పొట్టన పెట్టుకుంటోందన్నారు. సీఐ నాగరాజు చేతిలో గతంలో పల్నాడు జిల్లాలో దళిత సాయి, మంద సాల్మాన్‌ హత్యకు గురయ్యారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement