ఉషారాణి నా జీవితాన్ని నాశనం చేసింది..! | Tirupati Usha Rani Honeytrap Incident | Sakshi
Sakshi News home page

ఉషారాణి నా జీవితాన్ని నాశనం చేసింది..!

Jul 3 2026 12:11 PM | Updated on Jul 3 2026 12:26 PM

Tirupati Usha Rani Honeytrap Incident

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: జిల్లాలో హనీ ట్రాప్‌ ఉషారాణి అక్రమ సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మీడియా, పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నారు. గురువారం వడమాలపేట మండలం, పాదిరేడు గ్రామ మాజీ సర్పంచ్‌ చుక్కా శేఖర్‌ తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగి కిల్లి రవి అత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాయ లేడీ ఉషారాణి అరెస్టు అయిన విషయం తెలిసిందేనన్నారు. ఈ సందర్భంగా ఆమె చేత తీవ్రంగా నష్టపోయిన ఒక బాధితుడిగా మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

తన కష్టకాలంలో మానవత్వంతో తాను అందించిన సహాయాన్ని ఆసరాగా చేసుకొని, ఉషారాణి తనను తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేసి,  రూ.90 లక్షలకు పైగా బ్లాక్‌మెయిల్‌ చేసి వసూలు చేసిందని ఆరోపించారు. ఆమె చేసిన మోసాల చరిత్రను వివరిస్తూ ఇలాంటి ఉచ్చులో ఎవ్వరూ పడవద్దు అని చెబుతూ ఉషారాణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. 2008 –09 మధ్య ఉషారాణితో పరిచయం ఏర్పడిందన్నారు. మరొక వ్యక్తి సుబ్రమణ్యంతో అక్రమ సంబంధం పెట్టుకుని తిరుపతి సుందరయ్య నగర్‌లో నివాసం పెట్టిందన్నారు. తనను మానసికంగా వేధింపులు గురి చేసి రూ.కోటి వరకు లాక్కొందన్నారు. భూములు సైతం ఆమె పేరున రాయించుకుంటూ పత్రాలపై సంతకాలు తీసుకుని కోర్టులో దావా వేసిందని వాపోయారు. 

కోటి రూపాయల ఇల్లు కూడా తీసి ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిందన్నారు. పరువు పోకూడదు అనే భయంతో పెళ్లయిన తన కూతురు నగలు అమ్మి రూ.6 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఆమె మొదటి భర్త విశ్వనాథంను కాదని గాజులమండ్యం ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయం తెలిసి ప్రశ్నించడంతో అతనితో కలవడం మానేశానంటూ నమ్మబలికిందన్నారు. ఆమె మరో ఇద్దరితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే రేణిగుంట రైల్వే ఉద్యోగి కిల్లి రవితో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తరువాత రవి కూడా ఆమె బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement