రేపు తిరుమల జూన్‌ దర్శన కోటా విడుదల | TTD To Release June Quota For Tirumala Darshan Tickets And Accommodation From March 18th, More Details Inside | Sakshi
Sakshi News home page

రేపు తిరుమల జూన్‌ దర్శన కోటా విడుదల

Mar 17 2026 4:29 AM | Updated on Mar 17 2026 10:01 AM

Tirumala June darshan quota to be released tomorrow

తిరుమల: తిరుమలలో జూన్‌కు సంబంధించి శ్రీవారి వివిధ దర్శనాల, గదుల కోటాను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా, 23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్ల కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.  https://ttdevasthanams.ap.gov.in  ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement