ఇదేం వివక్ష?.. తిరుమలకే వచ్చి తాడో పేడో తేల్చుకుంటాం | Telangana MP Raghunandan Rao ultimatum TO TTD | Sakshi
Sakshi News home page

ఇదేం వివక్ష?.. తిరుమలకే వచ్చి తాడో పేడో తేల్చుకుంటాం

Published Fri, Mar 14 2025 12:16 PM | Last Updated on Fri, Mar 14 2025 12:20 PM

Telangana MP Raghunandan Rao ultimatum TO TTD

తిరుపతి, సాక్షి: సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన.. లెటర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు. 

ఉమ్మడి స్టేట్‌లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులందరి సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవాళ్లు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వివక్ష బాధాకరం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది. అయితే.. 

స్వయంగా సీఎం ఆదేశించినా.. అధికారులు మాత్రం అమలు చేయడం లేదు.. ఎందుకు?. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, గదుల సౌకర్యం కల్పించాలి. ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి. ఈ విషయమై పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి.  వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం. అనుమతించకపోతే ఎమ్మెల్యేలంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం. పార్టీలకతీతంగా నేను ఇది చెబుతున్నా’’ అని హెచ్చరించారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement