రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్‌ | TDP leadar Mining of Colored Stones in Anakapalle district | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్‌

Jun 15 2025 5:28 AM | Updated on Jun 15 2025 5:28 AM

TDP leadar Mining of Colored Stones in Anakapalle district

కరక క్వారీలో తవ్వకాలు జరిగేది ఈ కొండపైనే..

గొలుగొండ కరక క్వారీ 

దోచుకునేందుకు పన్నాగం

అడ్డుకుంటారన్న అనుమానంతో 

అటవీ అధికారుల మార్పు

కూటమి పాలనలో అక్రమార్కుల ఆటలు తారస్థాయికి చేరాయి. ఏడాది కాలంలో ఇసుక, గ్రావెల్, లేటరైట్, మైనింగ్‌ వంటి ప్రభుత్వ సంపదను దోచుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా రంగురాళ్లపైనే కన్నేశారు. ఇందుకోసం అటవీ శాఖలో కింది నుంచి పై వరకు తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారు. నేడో రేపో డీఎఫ్‌వోగా అస్మదీయుడినే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రేంజ్‌ పరిధిలో గల గొలుగొండ కరక క్వారీలో లభ్యమయ్యే రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు భారీ స్కెచ్‌ వేశారు. ఈ రంగురాళ్లకు దేశంలోనే అత్యంత గిరాకీ ఉంటుంది. కరక క్వారీలో అలెక్స్‌ (సిసలైన పచ్చ వైఢూర్యం) లభ్యమవుతుంది. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల ముఠా ఎదురుచూస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే వీరికి అనుకూలంగా ఉంటుంది.

ఈ పరిసర ప్రాంతంలోకి ఎవరైనా అక్రమార్కులు ప్రవేశించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అందుకే గార్డు స్థాయి నుంచి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి వరకూ ఇటీవల బదిలీలలో మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డీఎఫ్‌వోగా తమకు అనుకూలమైన వ్యక్తిని రప్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతని సిఫార్సుతోనే ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఫారెస్ట్‌ అధికారిని కూడా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. 

అవినీతి అధికారికి అందలం! 
ప్రస్తుతం అనకాపల్లి జిల్లా డీఎఫ్‌వోగా పనిచేస్తున్న శామ్యూల్‌ను మార్పు చేసి కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్స్‌ లేఖతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారిని తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతికి మారుపేరు అయిన ఒక అధికారిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సదరు అధికారి గతంలో విజయనగరంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌లో చిక్కారు.

గతంలో శ్రీకాకుళంలో కూడా ఇతని మీద ఒక ఏసీబీ కేసు ఉంది. రంగురాళ్ల తవ్వకాలకు అడ్డు లేకుండా అలాంటి వ్యక్తిని నర్సీపట్నం తీసుకొస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన వీఎంఆర్‌డీ డీఎఫ్‌వోగా రావటానికి భారీ ముడుపులు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ.. ఏసీబీ కేసు ఉండటం వలన సంస్థ తీసుకోవటానికి ఇష్టపడలేదు. సదరు అధికారి ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. బదిలీ జీవో నేడో, రేపో రానున్నట్లు సమాచారం.  

అనుకూలస్తులనే తెచ్చుకున్నారు..! 
ఈ నెల 9వ తేదీన కరక క్వారీ ప్రాంత గార్డు అయిన నవీన్, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి లక్ష్మీనరసింహలకు ఐదేళ్ల కాలపరిమితి ము­గి­యకపోయినా బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నట్లు గుస­గుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు గారు­్డగా వచ్చిన వ్యక్తి స్థానిక కూటమి నేతలకు బాగా పరిచయస్తుడు. ఇక్కడకు కొత్త­గా వచ్చిన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కూడా ఈ ప్రాంత కూటమి నాయకులకు సుపరిచితు­డు. ఏడాది క్రితం కేడీ పేటలో డీఆర్‌వోగా పనిచేసి ప్రమోషన్‌పై పాడేరు డివిజన్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. మళ్లీ నర్సీపట్నం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా బదిలీపై వచ్చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement