Oct 26th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu In Remand Of 47th Day In Skill Scam, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Oct 26th 2023 CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Oct 26 2023 7:35 AM

TDP Chandrababu In Rajahmundry Central Jail Live Updates - Sakshi

Chandrababu Naidu Arrest Remand & AP Political Updates

5:35 AM,  26 అక్టోబర్‌, 2023
భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు

1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు,  పెరుగు అమ్మి సంపాదించాడా?

2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా?

3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని  దగ్గుపాటి  పుస్తకం రాసింది నిజమా? కాదా?

4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది  నిజమా? కాదా?

5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా?

6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా?

7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు  బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని  అమరావతి కాంట్రాక్టర్ అయిన  షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు,

అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని  బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న  కేంద్ర సంస్థ  ఇన్‌కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా?

8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో  మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్  చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్  పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు.

ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా?

9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్‌ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా?

10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా?

5:05 AM,  26 అక్టోబర్‌, 2023
నిజమెందుకు చెప్పరు భువనేశ్వరీ గారు.?
పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి : భువనేశ్వరి పచ్చి అబద్దాలు
ఈ నిజాలు మీరే పరిశీలించండి

1) ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్‌

2)పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ 1
2022–23లో ..
రూ.7.65 లక్షల కోట్ల ఒప్పందాలతో మొదటి స్థానం లో ఏపీ
రూ.4.44 లక్షల కోట్లతో రెండో స్థానంలో గుజరాత్‌
దేశంలో పెట్టుబడులపై ‘ప్రాజెక్ట్స్‌ టుడే’  నివేదిక ఏప్రిల్ 20 , 2023

3) మార్చి 3న విశాఖ గ్లోబల్  ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13.42  లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు కుది­రాయి.

4) వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విస్తరణ చేపట్టిన కంపెనీలు :

- విప్రో
- ఆపాచి
- దివీస్ 2 కొత్త ప్లాంట్లు
- కియా
- యోకోహోమా
- సెంచురీ ప్లైవుడ్
- మాండలీజ్‌ చాక్లెట్స్‌

5) టీడీపీ ఎంపీ  గళ్ళ జయదేవ్ చౌదరి కంపెనీ అమర్‌ రాజా వెళ్లిపోలేదు, ప్రమాదకర కాలుష్యాన్ని నియంత్రించమని ప్రభుత్వమే సూచించింది

7) కియా పరిశ్రమ తెచ్చింది బాబు కాదు.. మోడీ.

2015 మే 19 న దక్షిణ కొరియా పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు హ్యుందాయ్  మోటార్ కంపెనీ చైర్మన్ ను కలిశారు.

ఇండియా లో మేము వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నామని హ్యుందయ్‌ చైర్మన్ మోడీతో చెప్పారు. ఇప్పటికే తమిళనాడులో ఒక ప్లాంట్ ఉందని కంపెనీ ఛైర్మన్‌ చెప్పగా.. పొరుగున ఉండే ఆంధ్రప్రదేశ్‌లో  పెట్టండి. మీకు కావల్సిన రాయితీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం అని మోడీ సలహా ఇచ్చారు. దీనితో కియా పరిశ్రమ ప్రతినిధులు అంగీకరించి ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేశారు ..

కియా పరిశ్రమ హెడ్ మాట్లాడుతూ 2015 మే,19 న మా సంస్థ ప్రతినిధులు భారత దేశ ప్రధాని మధ్య జరిగిన చర్చలు ఫలించడం వలనే మేము ఆంధ్ర ప్రదేశ్ లో కియా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పినట్టుగా డిసెంబర్ 8, 2017 న టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక లో వార్త వచ్చింది

Anantapur plant to lead Kia as one of the fastest-growing automobile brands

-Times Of India, Dec 8, 2017

GWANGJU: The Kia Motors, a subsidiary company of South Korea’s Hyundai Motors, is elated on its entry to Indian automobile market. Its upcoming project at Anantapur in Andhra Pradesh is part of Prime Minister Narendra Modi’s “Make in India” programme.

“India is an important partner of Hyundai Motor Group. Prime Minister Modi and Hyundai Motor Group’s top management had a fruitful meeting when PM visited Korea in 2015 and both parties had built mutual trust. Such mutual trust greatly contributed to Kia’s decision to invest in India,” said Jihyun Park, Associate (Global PR Team) of the Hyundai Motor Group.

Modi meets Hyundai Chairman and Samsung CEO in South Korea-ANI, May 19,2015

2:10PM, 26 అక్టోబర్‌, 2023
అధికారులతో ఆటలా?
అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డులు కావాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై సీఐడీ అధికారుల కౌంటర్‌
అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది
అధికారుల భద్రతకు ప్రమాదం ఉంది, కాల్‌ డేటా రికార్డులు అడగడం సబబు కాదు

1:40PM, 26 అక్టోబర్‌, 2023
లోపల ఆయన.. బయట నేను
రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట సినీ డైరెక్టర్ RGV సెల్ఫీ
చంద్రబాబును ఉద్ధేశించి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాంగోపాల్ వర్మ

12:40PM, 26 అక్టోబర్‌, 2023
హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌
అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను వెంటనే విచారించాలంటూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌
హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోని హైకోర్టు
ఇప్పటికే స్కిల్‌ స్కామ్‌లో వెకేషన్‌ బెంచ్‌ ముందు పెండింగ్‌లో ఉన్న చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
రేపు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్‌ బెంచ్‌
ఈలోపే అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు మరో పిటిషన్‌
చంద్రబాబుకు స్కిన్‌ ఎలర్జీ ఉందని, ఆయన వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని బాబు లాయర్లు పిటిషన్‌
బాబుకు కంటి సమస్యలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్న చంద్రబాబు లాయర్లు
ఇప్పటికే చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని, మరో కంటికి వెంటనే ఆపరేషన్‌ చేయాలంటున్న చంద్రబాబు న్యాయవాదులు
దీంతో పాటు చంద్రబాబుకు ఇతర అనారోగ్య సమస్యలున్నాయని పిటిషన్‌
ఇప్పటికే రాజమండ్రి జైల్లో చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు
బాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులకు నివేదిక సమర్పించిన వైద్యులు

10:05 AM,  26 అక్టోబర్‌, 2023
టార్గెట్‌ డిపాజిట్‌ : వారాహి రూటు మారుతుందా?
నిన్నటి అమిత్‌షా మీటింగ్‌ తర్వాత రూటు మార్చిన పవన్‌
తెలంగాణలోనూ వారాహి యాత్ర చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
పోటీ చేసే నియోజకవర్గాల్లో డిపాజిట్‌ రాకపోతే పరువు పోతుందన్న భయం
ఎన్ని సభలు పెట్టయినా, ఎన్ని రోడ్‌ షోలు పెట్టయినా.. డిపాజిట్‌ కాపాడుకోవాలన్న యోచన
తెలంగాణలో వారాహి యాత్రతో పాటు పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్న జనసేన

09:45 AM,  26 అక్టోబర్‌, 2023
భువనేశ్వరీ గారు.. చెక్కు వెనక కొంచెం నిజాలు చెబుతారా?
చంద్రబాబు అరెస్టయింది సెప్టెంబర్‌ 9, 2023న
చంద్రగిరి మండలం పాతపేటకు చెందిన ప్రవీణ్‌ మరణించింది అక్టోబర్‌ 16న
► ప్రవీణ్‌ కుటుంబానికి  భువనేశ్వరీ చెక్కు ఇచ్చిన తేదీ సెప్టెంబర్‌ 4, 2023
చంద్రబాబు అరెస్ట్‌ అవుతాడని ముందే ఊహించి సంతకాలు తీసుకున్నారా?
లేక చంద్రబాబు అరెస్ట్‌ కాగానే అభిమానులు చచ్చిపోవాలని ముందే ప్లాన్‌ వేసుకున్నారా?
ఎక్కడ, ఎవరు మరణించినా.. అది మీ ఖాతాలో వేసుకున్నారా?
అసలేం జరిగింది? సెప్టెంబర్‌ 4నే చెక్కు ఎలా తయారయింది?
దయచేసి నిజం చెప్పండి ప్లీజ్‌

09:30 AM,  26 అక్టోబర్‌, 2023
పరాకాష్టకు చేరిన పచ్చమీడియా పిచ్చి ప్రచారాలు
చంద్రబాబు కోసం విలువలు విడిచిన ఎల్లోమీడియా జర్నలిజం
రైళ్లో రాజమండ్రి నుంచి వెళ్తూ అందరూ చంద్రబాబు గురించే చర్చించుకుంటున్నారంటూ పచ్చమీడియాలో వార్తలు
సోమవారం ఉదయం రాజమండ్రి వచ్చిన హౌరా-తిరుచిరాపల్లి ట్రైన్‌లో ఘటన అంటూ ఓ కల్పిత కథ
సోషల్‌ మీడియాలో తెగ ఆడుకున్న నెటిజన్లు
పిచ్చి నిజంగానే పరాకాష్టకు చేరిందంటున్న నెటిజన్లు
ఇంకా నయం, అంతరిక్షంలో అస్ట్రోనాట్లు కన్నీళ్లు పెట్టుకున్నారనలేదని ఎద్దేవా
మీ తీరు ఎప్పటికీ మారదు, మీరు పెట్టిన భ్రమల్లోనే చంద్రబాబు కూడా ఉన్నారంటున్న నెటిజన్లు



 

09:10 AM,  26 అక్టోబర్‌, 2023
అమిత్‌షా మీటింగ్‌లో ఏం జరిగింది?
► ఢిల్లీలో మీటింగ్‌ పూర్తవగానే ముఖం మాడ్చుకుని వెళ్లిపోయిన పవన్‌ కళ్యాణ్‌
► జనసేనతో ముందుకు వెళ్లాలా, పక్కన పెట్టాలా అన్న ఆలోచనలో బీజేపీ
► పవన్‌ కళ్యాణ్‌ నమ్మదగ్గ పార్ట్‌నర్‌ కాదన్న భావనలో బీజేపీ
► తెలంగాణలో పొత్తు అడుగుతున్నాడు కానీ.. ఏపీలో ఏం చేశాడు?
► వద్దు వద్దంటున్నా.. మాట మాత్రం చెప్పకుండా టిడిపికి ఎందుకు జై కొట్టాడు?
► అవినీతి ఆరోపణలపై అరెస్టయి జైలు ఉన్న చంద్రబాబును కలవడం వల్ల ఏం సందేశమిచ్చినట్టు?
► జైలు బయట పొత్తు ప్రకటించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్లింది?
► ఇప్పటికి పవన్‌ కళ్యాణ్‌ పొత్తు పెట్టుకున్న పార్టీలెన్ని?
► కమ్యూనిస్టులు, తెలుగుదేశం, బీజేపీ.. చివరికి బీఎస్పీ.?
► పవన్‌ కళ్యాణ్‌లో అవకాశవాదం తప్ప నైతిక విలువలతో కూడిన రాజకీయం లేదు కదా?
► ఇలాంటి పవన్‌ను నమ్ముకుంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటీ?
► సింగిల్‌గా పోటీ చేసిన పవన్‌ను సింగిల్‌ సీటుకు పరిమితం చేసినపుడే దూరం పెట్టాల్సింది..!

09:00 AM,  26 అక్టోబర్‌, 2023
తెలంగాణలో సైకిల్‌కు ఎండ్‌ కార్డ్?
► తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చిన తెలుగుదేశం
► తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పార్టీ చేయించిన సర్వేల్లో ఘోరమైన ఫలితాలు
► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గెలవదని తెలుసుకున్న పార్టీ అధిష్టానం
► తమ పార్టీకి గొప్ప చరిత్ర ఉందని ఘనంగా నిన్నా, మొన్నటి వరకు చెప్పుకున్న నాయకులు
► చంద్రబాబు కోసం తెలంగాణలో కృత్రిమ ధర్నాలు, పెయిడ్‌ ప్రదర్శనలు
► తీరా ఎన్నికల్లో ఒక్క చోట కూడా పోటీకి ముందుకు రాని వైనం
► నేడు చంద్రబాబును కలవనున్న పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
► తెలంగాణలో పోటీ చేయకూడదన్న నిర్ణయంపై తన నిరసన తెలపాలని జ్ఞానేశ్వర్‌ యోచన
► ఇప్పటికే బోలెడు ఖర్చు పెట్టించారన్న ఆందోళనలో కాసాని జ్ఞానేశ్వర్
► ఈ మాత్రం దానికి బాలకృష్ణతో తెలంగాణలో ఎందుకు ప్రెస్‌ మీట్‌ పెట్టించారని అడుగుతున్న జ్ఞానేశ్వర్‌
► పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తుందని ప్రకటించిన బాలకృష్ణ, అంతలోనే నిర్ణయం మార్చేసుకున్న టిడిపి

08:48 AM,  26 అక్టోబర్‌, 2023
వచ్చారయ్యా.. మ్యానిఫెస్టో మాయగాళ్లు
► మరోసారి మోసపూరిత హామీలతో ఉమ్మడి మేనిఫెస్టోకు బాబు-పవన్ సిద్ధం
► 2014 ఎన్నికల్లో కూడా పవన్ ఫొటోతో మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ
► టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆ హామీలకు తాను పూచీ అని ప్రకటించిన పవన్
► హామీలంటూ కరపత్రాల పై చంద్రబాబు, పవన్ ఉమ్మడి సంతకాలు
► ఎన్నికల్లో గెలిచాక హామీలు గాలికి....టీడీపీ వెబ్‌సైట్‌లోంచి మేనిఫెస్టో కూడా మాయం
► డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి....అన్నీ గాలికి
► ఒక్క హామీ పై కూడా టీడీపీని ప్రశ్నించని పవన్...ఐదేళ్లూ ‘ష్!గప్‌చుప్’
► 2019లో వినూత్న మేనిఫెస్టోతో ప్రజల మనసులు గెలుచుకున్న సీఎం జగన్
► మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలి ఏడాదిలోనే 80 శాతం హామీలకు గ్రీన్ సిగ్నల్
► కోవిడ్ కష్టాలు సైతం లెక్క చేయకుండా నాలుగేళ్లలో ఏకంగా 99 శాతం హామీల అమలు
► వాటిని రకరకాలుగా అడ్డుకోవటానికి ప్రయత్నించి విఫలమైన బాబు-పవన్ ద్వయం

08:36AM,  26 అక్టోబర్‌, 2023
ఆడలేక.. మద్దెల ఓడు చందాన కాల్‌ డాటా కావాలట.?
► సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డ్ పిటిషన్‌పై నేడు విచారణ
► పిటిషన్‌ను విచారించనున్న ఏసీబీ కోర్టు
► సీఐడీ తరఫున ఇవాళ కౌంటర్ దాఖలు చేసే అవకాశం
► తప్పు చేయలేదని చెప్పకుండా.. సాంకేతిక సాకులు వెతకడమెందుకు?
 

08:16AM,  26 అక్టోబర్‌, 2023
బెయిల్‌ కోసం హౌస్‌ మోషన్‌
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్
►స్కిల్ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు
►రేపు వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చే అవకాశం

07:00AM, 26 అక్టోబర్‌, 2023
మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపరే! 
►2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు
►ఆ తర్వాత ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబు
►నాటి ప్రభుత్వ తీరుతో రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందల మంది ఆత్మహత్యలు 
►రుణాలు మాఫీ చేయకపోవడంతో వాటిపై వడ్డీలు పెరిగిపోయి మహిళలు బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుని తీవ్ర ఇబ్బందులు
►ఎన్‌పీఏలుగా (నిరర్థక ఆస్తులు) మారిన సంఘాలు
►క్రెడిట్‌ రేటింగ్‌ను కోల్పోయి రుణాలకు అనర్హులు
►ఏటా క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తానని చెప్పిన బాబు
►దాన్ని అమలు చేయకుండా యువత, విద్యార్థులను మోసం
►పైగా ప్రభుత్వ ఉద్యోగులను 2 లక్షలకుపైగా కుదించి అన్యాయం
►ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేకపోతే ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని గాలికి వదిలేసిన బాబు
►ఎన్నికలకు మూడు నెలలు ఉందనగా కొద్దిమందికి భృతి పేరుతో చేతులు విదిల్చి మభ్యపెట్టిన చంద్రబాబు

6:45AM, 26 అక్టోబర్‌, 2023
మరోసారి మోసపూరిత హామీలతో ఉమ్మడి మేనిఫెస్టోకు బాబు–పవన్‌ సిద్ధం
►2014 ఎన్నికల్లో కూడా పవన్‌ ఫొటోతో మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ
►టీడీపీ తరఫున ప్రచారం చేసి... ఆ హామీలకు తాను పూచీ అని ప్రకటించిన పవన్‌
►హామీలంటూ కరపత్రాలపై చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్‌ ఉమ్మడి సంతకాలు
►ఎన్నికల్లో గెలిచాక హామీలు గాలికి... టీడీపీ వెబ్‌సైట్లోంచి మేనిఫెస్టో కూడా మాయం
►డ్వాక్రా రుణ మాఫీ, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి... అన్నీ గాలికి
►ఒక్క హామీపై కూడా తెలుగుదేశాన్ని ప్రశ్నించని పవన్‌కళ్యాణ్‌... ఐదేళ్లూ ‘ష్‌! గప్‌చుప్‌’..
►2019లో వినూత్న మేనిఫెస్టోతో ప్రజల మనసులు గెలుచుకున్న వైఎస్‌ జగన్‌
►మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ... తొలి ఏడాదిలోనే 80 శాతం హామీలకు గ్రీన్‌సిగ్నల్‌
►కోవిడ్‌ కష్టాలు సైతం లెక్కచేయకుండా.. నాలుగేళ్లలో ఏకంగా 99% హామీల అమలు
►వాటిని రకరకాలుగా అడ్డుకోవటానికి ప్రయత్నించి విఫలమైన బాబు–పవన్‌ ద్వయం
►మళ్లీ ప్రజలను మోసపుచ్చేందుకు పవన్‌ ప్రయత్నాలు 

6:40AM, 26 అక్టోబర్‌, 2023
భువనేశ్వరి యాత్రపై మంత్రి అంబటి ధ్వజం
►అబద్ధం గెలవాలంటూ భువనేశ్వరి యాత్ర చేయాలి
►నిజం గెలిస్తే బాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రారు
►చంద్రబాబుపై ప్రభుత్వానికి ఎలాంటి కక్షా లేదు

ఎన్నో  కొన్ని ఇవ్వండి, పొత్తు ఉందని ప్రచారం చేసుకుంటాం
► తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
► తమకు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే చాలంటున్న జనసేన
► ఇక్కడ గెలవడం, గెలవకపోవడం ముఖ్యం కాదు, పోటీలో ఉన్నామన్న పేరు చాలంటున్న జనసేన
► అప్రాధాన్యంగా ఉండే ఓ 10 సీట్లు జనసేనకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం

ఢిల్లీలో లోకేష్‌ ప్రయత్నాలు బెడిసికొట్టాయా?
► ఢిల్లీలో లాయర్లను కలుస్తున్నానని చెప్పుకొచ్చిన లోకేష్‌
► తెర వెనక మరో ప్రయత్నం జరిగిందని ఢిల్లీ లాబీల్లో ప్రచారం
► లోకేష్‌ చేసిన పనితో ఇరుకునపడ్డ కొందరు పెద్ద మనుష్యులు
► కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిన లోకేష్‌కు సహకరించిన వారి పరిస్థితి
► ఏపీలో బాగా సహకరించిన ఓ పెద్ద మనిషి సాయంతో ప్రయత్నాలు చేసిన లోకేష్‌
► పని కాకపోగా.. పెద్దమనిషే అడ్డంగా ఇరుక్కున్నట్టు సమాచారం

పొత్తుల తక్కెడలో లెక్క కుదరక మీటింగ్‌లే మీటింగ్‌లు
► టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు మరిన్ని జరపాలని నిర్ణయం
► ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు
► ఈనెల 29న శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో., ప్రకాశం, అనంత జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు
► 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి సమావేశాలు
► 31న విశాఖ, ప.గో., గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్న టీడీపీ - జనసేన నేతలు
► వచ్చే నెల రెండో వారంలో టీడీపీ, జనసేన జేఏసీ రెండో భేటీకి ఛాన్స్
► టికెట్‌ ఇవ్వలేని వారిని సముదాయించనున్న సమన్వయ కమిటీ నేతలు
► ఖర్చు పెట్టామంటే కుదరదు, అధిష్టానం పొత్తు పెట్టుకుందని చెప్పనున్న కమిటీ నేతలు

Advertisement
Advertisement