గుంటూరు తొక్కిసలాట.. మొత్తం చేసింది టీడీపీనే.. తప్పుడు రాజకీయం బట్టబయలు

TDP Chandrababu Guntur Rally False Propaganda Exposed - Sakshi

గుంటూరు: టీడీపీ తప్పుడు రాజకీయం, అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలైంది. ఆదివారం తొక్కిసలాట జరిగిన గుంటూరు సభకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమారే దరఖాస్తు చేయగా, ఈ లేఖతోనే పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు.

అయితే సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయాక టీడీపీ ప్లేటు ఫిరాయించింది. ఈ సభతో తమకు సంబంధమే లేదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఉయ్యూరు ఫౌండేషనే ఈ సభకు అనుమతి తీసుకుందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఇలాంటివారిని ఎంకరేజ్ చేయాలనే సభకు హాజరయ్యానన్నారు.

అసలు టీడీపీ దరఖాస్తులో చంద్రన్న కానుకల ప్రస్తావనే లేదు. కానీ జనాలు భారీగా రావాలని కానుకలు ఇస్తామంటూ చెప్పి టీడీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కానుకలకు ఆశపడి జనం తరలివెళ్లారు.

అయితే కానుకలు కొందరికే ఇచ్చి మిగతావాళ్లను వెళ్లగొట్టారు. తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తన సభలో ఇంత విషాదం జరిగినా బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా చంద్రబాబు వెళ్లలేదు. గుంటూరు ఘటనకు నాలుగు రోజుల ముందే కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలోనూ తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు.
చదవండి: గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్‌ అరెస్ట్‌

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top