గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్‌ అరెస్ట్‌

Vuyyuru Srinivas Arrested In Guntur Stampede Incident - Sakshi

సాక్షి, గుంటూరు: విజయవాడ ఏలూరు రోడ్‌లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు.

కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన విషాదం మరువక ముందే మరో దారుణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు. చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు.
చదవండి: పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన.. వాసిరెడ్డి పద్మ ఫైర్‌

ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్‌ షో  కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్‌లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది. దీంతో, చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడితున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top