సీనియర్‌ ఐపీఎస్ సునీల్‌ కుమార్‌ సర్వీస్‌ నుంచి రిలీవ్‌ | Suspended Senior IPS Officer Sunil Kumar Relieved From Service | Sakshi
Sakshi News home page

సీనియర్‌ ఐపీఎస్ సునీల్‌ కుమార్‌ సర్వీస్‌ నుంచి రిలీవ్‌

Jun 29 2026 7:43 PM | Updated on Jun 29 2026 7:55 PM

Suspended Senior IPS Officer Sunil Kumar Relieved From Service

సాక్షి,విజయవాడ: సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీయస్ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ను ప్రభుత్వం సర్వీస్‌ నుంచి రిలీవ్‌ చేసింది. జూన్‌ 30న సూపర్‌ యాన్యువేషన్‌తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే,సస్పెన్షన్‌లో ఉండగానే పీవీ సునీల్ పదవీ కాలం ముగిసిపోవడం గమనార్హం.

గత రెండేళ్లుగా పీవీ సునీల్‌పై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపునకు పాల్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టి చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. చివరికి సస్పెన్షన్ కాలంలోనే ఆయన పదవీ కాలం కూడా ముగిసిపోయింది. పీవీ సునీల్ కుమార్ సర్వీస్ నుండి రిలీవ్ అయినప్పటికీ, ఆయనపై పెండింగ్‌లో ఉన్న వివిధ శాఖాపరమైన, క్రిమినల్‌ విచారణలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement