‘ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది’ | Subba Reddy Criticizes AP Government’s Mounting Debt | Sakshi
Sakshi News home page

‘ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది’

Mar 23 2026 4:22 PM | Updated on Mar 23 2026 7:13 PM

Subba Reddy Criticizes AP Government’s Mounting Debt

సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘ఏపీలో అభివృద్ధి పనులు చేయకుండా... అప్పులు చేస్తున్నారు. ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. కేవలం 22 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 3 లక్షల 18 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా భవిష్యత్తు తరాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ అప్పులపై కేంద్ర పర్యవేక్షణ ఉండాలి.

చేస్తున్న అప్పులతో ఫలితాలు వస్తున్నాయా? అని పరిశీలన జరగాలి. అప్పులతో తెచ్చిన నిధులతో ఆస్తులు నిర్మించి, జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. విద్యారంగానికి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. ఏపీలో 60 శాతం ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆలస్యం అవుతుంది.

దీనివల్ల బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. మత్స్య సంపద ఎగుమతులు 60% ఏపీ నుంచే జరుగుతున్నాయి. 1,60,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. వేలాదిమంది దీనిపై ఆధారపడ‍్డారు. కోస్తా తీరంలో మత్స్యకారులు ఉపాధికి చర్యలు తీసుకోవాలి. గోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హార్బర్ ఆధునికీకరణ జరగాలి.

కోస్తా ప్రాంతంలో మెరైన్ ప్రాసెస్  క్లస్టర్ ఏర్పాటు చేయాలి. సెస్, సర్ చార్జీల వల్ల రాష్ట్రాలు తగిన వాటా పొందలేకపోతున్నాయి. దీనిపై పునః పరిశీలన జరగాలి. వైద్యరంగంపై తగిన దృష్టి సారించాలి. ఆరోగ్య పథకాలకు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దేశిత గడువుతో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. మేజర్ రైల్వే ప్రాజెక్టులను జవాబుదారీతనంతో పూర్తి చేయాలి’ అని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement