Tirumala: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు | Srivari Salakatla Brahmotsavam 2023 chandraprabha vahanam | Sakshi
Sakshi News home page

తిరుమల బ్రహ్మోత్సవాలు: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు

Sep 24 2023 7:58 PM | Updated on Sep 24 2023 8:04 PM

Srivari Salakatla Brahmotsavam 2023 chandraprabha vahanam - Sakshi

చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి..

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడో రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.  వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement