Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Huge Devotees Rush In Tirumala Temple | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Mar 17 2026 7:41 AM | Updated on Mar 17 2026 7:41 AM

Huge Devotees Rush In Tirumala Temple

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. .శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు.   సోమవారం అర్ధరాత్రి వరకు  70,606 మంది స్వామిని దర్శించుకున్నారు.   28,415  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.  4.39   కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు  18  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement