ప్రతి ఇంటికీ సురక్షిత నీరు | Safe water for every household | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

Jun 7 2023 5:20 AM | Updated on Jun 7 2023 5:29 AM

Safe water for every household - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి విని మహాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో ఆమె భేటీ అయ్యారు.

అనంతరం జల్‌ జీవన్‌ మిషన్, స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ్‌) కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తరువాత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకంపై స­మీక్షించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలన్నదే జల్‌ జీవన్‌ మిషన్‌ ముఖ్య ఉద్దేశమని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల­ని స్పష్టం చేశారు. 2024 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా తగినంత ప్ర­మా­ణంలో శుద్ధమైన తాగునీటిని అందించాలని కో­రా­రు.

ఇందుకు గ్రామ పంచాయతీలను పూర్తి­గా బ­లో­పేతం చేసి మహిళా స్వయం శక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని సూ­చించారు. ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా ని­ర్వ­హించేందుకు అవసరమైన అన్ని చర్య­లు చేప­ట్టాలని, వ్యర్థాలను లాభదాయక వనరులుగా వినియోగించుకొనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమ­లుపై కేంద్ర కార్యదర్శి విని మహాజన్‌ మాట్లాడుతూ.. ప్ర­తి ఇంటికీ విధిగా మరుగుదొడ్డి నిర్మించాలన్నారు. 

విజయవంతంగా అమలుకు చర్యలు 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జల్‌ జీవన్‌ మిషన్, స్వ­చ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికీ కుళాయి, మరుగు­దొ­డ్డి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చాక వర్షాకాలంలో వచ్చే డయేరియా కేసులు పూర్తిగా తగ్గాయని చెప్పారు.

ప్రతి ఇంటి నుంచి ఘన, ద్రవ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటిని సక్రమ విధానంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యాన్ని కలి్పంచేందుకు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement