తిరుపతి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకీ దేవి, శ్రీ భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ చె. వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు తదితర జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు.


