
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని స్మైలీ హాస్పటల్‌లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పట్టణంలోని చెరువు బజారు చెందిన గుంజా గాయత్రి (25) ని ప్రసవం కోసం నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు.
ప్రసవం అయిన తర్వాత గాయత్రి పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడలోని స్మైలీ ప్రధాన ఆసుపత్రికి తరలించారు .
అయితే తనకు బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించడంతో చికిత్సపొందుతూ గాయత్రి మరణించింది. దాంతో గాయత్రి మృతదేహాన్ని జగ్గయ్యపేట స్మైలి హాస్పిటల్‌కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన బంధువులు. భారీగా మోహరించిన పోలీసులు.