టీడీపీ నేతల అరాచకం.. నాగరాజుకు తీవ్ర గాయాలు | police solve ysrcp activist kidnapped in palnadu district | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అరాచకం.. నాగరాజుకు తీవ్ర గాయాలు

Aug 8 2024 5:34 PM | Updated on Aug 8 2024 7:41 PM

police solve ysrcp activist kidnapped in palnadu district

పల్నాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులు.. నాగరాజును చావబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలు అ​య్యాయి. నాగరాజును బొల్లాపల్లి స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు.. ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. కిడ్నాడ్‌ ఘటనకు సంబంధించ ఎనిమిది మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కిడ్నాపర్లను విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గోప్యగా ఉంచుతున్నారు.  

బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement