విశాఖలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య | PG medical student commits dead in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Sep 25 2026 4:25 AM | Updated on Sep 25 2026 4:25 AM

PG medical student commits dead in Visakhapatnam

బీచ్‌రోడ్డు: ఆంధ్రా మెడికల్‌ కళాశాల­(ఏఎంసీ) పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్‌ పి.శైలజ ఆత్మహ­త్య­కు పాల్ప­డ్డారు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీ­సులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న విద్యార్థిని ఎండీ జనరల్‌ మెడిసిన్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఇటీవల జరిగిన పరీక్షలను అనుకున్న స్థాయిలో రాయలే­కపోయానని, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యుల వద్ద బాధపడుతుంది. 

ఈ క్రమంలో గురువారం పరీక్ష ఉండగా ఉదయం ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరిపోసుకుని ఆత్మహ­త్యకు పాల్ప­డింది. ఈ ఘటనతో ఏఎంసీ క్యాంపస్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై తోటి విద్యార్థులు, అధ్యాప­కులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘట­నా స్థలాన్ని పరి­శీ­లించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రిన్సిపల్‌
శైలజ కుటుంబ సభ్యులను కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి పరామర్శించారు. ఘటనకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలిచి అవసరమైన సహాయం అందించాలని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ విష్ణువర్ధన్‌ను కోరారు. వైద్య విద్యార్థిని మృతిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement