జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

డాబాగార్డెన్స్‌: నగరంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడం, మ్యాన్‌హోల్స్‌, డ్రెయిన్లు, కాలువల్లో అడ్డంకులను తొలగించడం, కూలిన చెట్లు, గోడలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో ముందస్తుగా 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ఇప్పటి వరకు 58 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కమిషనర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం 7 గంటల వరకు 143 వర్ష సంబంధిత ఘటనలు, ఫిర్యాదులు నమోదు కాగా 140 పరిష్కరించినట్లు చెప్పారు. 89 చెట్లు కూలిన ఘటనల్లో తొలగింపు చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement