వర్ష విలయం | - | Sakshi
Sakshi News home page

వర్ష విలయం

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

IIలో

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సంపత్‌ వినాయగర్‌ హుండీల ఆదాయం రూ.15 లక్షలు

విశాఖలో

మహారాణిపేట: ఆశీలమెట్ట శ్రీ సంపత్‌ వినాయగర్‌ స్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 14 రోజులకు నగదు రూ.15,11,900, నాణేల రూపేణా రూ.62,981 కలిపి మొత్తం రూ.15,74,881 ఆదాయం వచ్చినట్లు ఈవో, ఏసీ ఎంవీవీప్రసాదరావు తెలిపారు. 120 అమెరికన్‌ డాలర్లు, 1,065 గ్రాముల బంగారం, 11.400 గ్రాముల వెండి కూడా లభించినట్లు చెప్పారు. ఆదాయాన్ని బ్యాంకు ఆఫ్‌ ఇండియా సూర్యాబాగ్‌ శాఖకు అప్పగించినట్లు తెలిపారు.

సాక్షి, విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు మహా విశాఖను అతలాకుతలం చేశాయి. నాలుగు రోజులుగా కొనసాగుతున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు వరద నీటితో నదులను తలపించగా.. పలు చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటం, ప్రహరీ గోడలు కూలడం, భారీ వృక్షాలు నేలకొరగడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు కాలనీలు అంధకారంలో మునిగిపోయాయి. శుక్రవారం సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తీరం దాటినా.. కొనసాగిన వర్షాలు

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3,512.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 319.3 మి.మీ.గా ఉంది. సుమారు 100 ప్రాంతాల్లో 100 మి.మీ.కిపైగా వర్షం కురిసింది. విశాఖ రూరల్‌ మండలంలో సగటున 412.4 మి.మీ, సీతమ్మధార మండలంలో 386.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శ్రీకాకుళం జిల్లా పోలాకి–కళింగపట్నం మధ్య తీరం దాటింది. అనంతరం బలహీనపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనిస్తోంది. తీరం దాటే ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంతో వాతావరణంలో తేమ ప్రభావం కారణంగా వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

కూలిన గోడలు.. విరిగిన కొండచరియలు

భారీ వర్షాలకు కై లాసపురం, వెంకోజీపాలెం, చైతన్యనగర్‌ తదితర కొండ ప్రాంతాల్లో మట్టిపెళ్లలు, కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు కొండవాలు ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జీవీఎంసీ 22వ వార్డులోని మంగాపురం కాలనీ వెనుక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖాళీ స్థలానికి చెందిన భారీ ప్రహరీ గోడ కూలిపోవడంతో వరద నీరు సుమారు 100 ఇళ్లలోకి చేరింది. రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. సీతకొండ వ్యూ పాయింట్‌ వద్ద కొండచరియలు విరిగిపడి భారీ బండరాళ్లు రోడ్డుపైకి జారాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లపైకి బండరాళ్లు జారాయి. మధురవాడ కొమ్మాదిలోని రాకాన్‌ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌ నీట మునిగి ప్రహరీ గోడ కూలడంతో 15 కుటుంబాలు చిక్కుకున్నాయి. వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏవీఎన్‌ కాలేజీ, సెయింట్‌ ఆంథోనీ స్కూల్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలాయి. హనుమంతవాక కొండ వద్ద రిటైనింగ్‌ వాల్‌ కూలి మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పీఎం పాలెం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్రహరీ కూలడంతో ఆనుకుని ఉన్న రహదారి కుంగిపోయింది. పెదగంట్యాడలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరింది.

నేలకొరిగిన వృక్షాలు.. నిలిచిన విద్యుత్‌

ఈదురుగాలులు, కుండపోత వర్షాలకు ఆనందపురం హైవే, ఏయూ గ్రౌండ్స్‌, బీచ్‌రోడ్‌, ఆశీలమెట్ట, లాసన్స్‌ బే కాలనీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో 80కిపైగా భారీ చెట్లు నేలకొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్‌ తీగలపై పడటంతో సుమారు 19 వేల ఇళ్లకు సరఫరా నిలిచిపోయింది. నాయుడుతోటలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోగా.. పీఎం పాలెంలోని కీర్తన ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు చేరి విద్యుత్‌ మీటర్లు ధ్వంసమయ్యాయి. ఎండాడ, కొమ్మాది జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తెగి రోడ్లపై పడ్డాయి. మధురవాడ, మిథిలాపురికాలనీల్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

మహారాణిపేట: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. కలెక్టరేట్‌, జీవీఎంసీ, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో 24 గంటలూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. కణితి కెనాల్‌ వద్ద కాలువలో పడిన కారు నుంచి ఒకరిని, మధురవాడ వద్ద నీటిలో చిక్కుకున్న కారులోని నలుగురిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల బాధితుల కోసం సైక్లోన్‌ షెల్టర్లు, కమ్యూనిటీ హాళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, వైద్య వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్‌, రహదారులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

అత్యవసర సహాయక నంబర్లు:

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌: 0891–2590100 / 0891–2590102

జీవీఎంసీ టోల్‌ ఫ్రీ: 1800–425–00009 వాట్సాప్‌: 9014218870

విద్యుత్‌ శాఖ: 7382299975

ఫైర్‌ సర్వీసెస్‌: 101 / 0891–2563582

మెడికల్‌ ఎమర్జెన్సీ: 8331093136 / 9010292576

100 ప్రాంతాల్లో

100 మి.మీ.కిపైగా వర్షం

కూలిన ప్రహరీ గోడలు..

విరిగిపడిన కొండచరియలు

ఇళ్లు, అపార్ట్‌మెంట్లపై జారిన బండరాళ్లు

నేలకొరిగిన భారీ వృక్షాలు..

19 వేల ఇళ్లకు నిలిచిన

విద్యుత్‌ సరఫరా

4.05 హెక్టార్లలో

ధ్వంసమైన అరటి పంట

నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు

ఆరిలోవ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ శుక్రవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. వర్ష తీవ్రత తగ్గకపోవడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించినట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్నీ తప్పనిసరిగా సెలవు పాటించాలని ఆదేశించారు.

52 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

మహారాణిపేట: జిల్లాలో మిగిలిన 52 మద్యం షాపులకు ఎకై ్సజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటికి అక్టోబర్‌ 1లోగా దరఖాస్తు చేసుకోవా లని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 40, పద్మనాభంలో 5, ఆనందపురంలో 5, భీమిలి రూరల్‌లో 2 షాపులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 5న వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఏరినాలో జిల్లా కలెక్టర్‌ సమక్షంలో లాటరీ నిర్వహించి షాపులను కేటాయించనున్నట్లు ప్రసాద్‌ తెలిపారు.

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు పీఎఫ్‌ వడ్డీ జమ

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వార్షిక వడ్డీని గురువారం జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు మేరకు స్టీల్‌ప్లాంట్‌ ఈపీఎఫ్‌ ట్రస్ట్‌ ఇటీవల జరిగిన సమావేశంలో 8.25 శాతం వడ్డీని ఆమోదించింది. అనంతరం ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని పోస్టింగ్‌ చేశారు. వడ్డీ జమ కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఓల్డ్‌ ఐటీఐలో వెల్డింగ్‌ శిక్షణ

మురళీనగర్‌: కంచరపాలెం ఓల్డ్‌ ఐటీఐలో నిరుద్యోగ యువకులకు వెల్డింగ్‌ టెక్నాలజీలో మూడు నెలల ఉచిత శిక్షణ ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజనలో భాగంగా శిక్షణ ఇస్తారు. టెన్త్‌, ఆపై చదివిన వారు అర్హులు. ఆధార్‌, అర్హత సర్టిఫికెట్ల కాపీలు, పాస్‌ పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 8555868681 నంబర్‌ను సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement