ముమ్మాటికీ కాకుమానుది కూటమి సర్కార్‌ హత్యే: అశోక్‌ కుమార్‌ | Chintalapudi Ashok Kumar Comments On Kakumanu Rajasekhar Death | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ కాకుమానుది కూటమి సర్కార్‌ హత్యే: అశోక్‌ కుమార్‌

Sep 24 2026 10:03 PM | Updated on Sep 24 2026 10:19 PM

Chintalapudi Ashok Kumar Comments On Kakumanu Rajasekhar Death

సాక్షి, గుంటూరు: కాకుమాను రాజశేఖర్‌ది మరణం కాదు.. ప్రభుత్వ హత్య అని వైఎస్సార్‌సీపీ అద్దంకి ఇన్‌ఛార్జ్‌ డా.చింతలపూడి అశోక్‌కుమార్‌ అన్నారు. ‘‘శాప్‌ వద్ద నిరసనలో పాల్గొన్న కాకుమాను రాజశేఖర్‌ను కిందపడేసి తన్నుతూ గుండెపై పోలీసులు గుద్దారు. వెంటనే రాజశేఖర్‌ ఒంగోలు ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఇబ్బందిపడుతూనే హైదరాబాద్‌ వెళ్లారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మరణించారు. ముమ్మాటికీ కాకుమానుది కూటమి సర్కార్‌ హత్యే’’ అని అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు.

‘‘కాకుమాను రాజశేఖర్ మరణం చాలా విచారకరం. ఒక డాక్టర్‌గా కాకుమాను రాజశేఖర్ మరణంపై విచారించాను. కాకుమాను రాజశేఖర్‌ది అకాల మరణం కాదు.. కూటమి ప్రభుత్వం చేసిన హత్య అని స్పష్టంగా అర్థం అవుతుంది. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నిరసనగా విజయవాడ శాప్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో కాకుమాను రాజశేఖర్ పాల్గొన్నారు. ఆ ధర్నాలో కాకుమాను రాజశేఖర్‌ను పోలీసులు గుండెల మీద గుద్దటం, కిందపడేసి తన్నడం నాకు చాలా బాధేసింది.

..పక్కనున్న వ్యక్తితో రాజశేఖర్ నాకు బాగా ఇబ్బందిగా ఉందని కారులో వెళ్లి కూర్చున్నారు. అదే బాధతో ఒంగోలు వెళ్లి హాస్పటల్లో బీపీ చెక్ చేయించుకున్నారు. అలా ఇబ్బంది పడుతూ డాక్టర్‌కు చూపించుకోవడానికి హైదరాబాద్ వెళ్లారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మరణించారు’’ అని అశోక్‌కుమార్‌ చెప్పారు.

ఇదీ చదవండి: గవర్నర్‌ ఆశ్చర్యపోయారు: అంబటి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement