‘సినిమా డైలాగులతో నీ నోటి తీట తీరుతుంది.. అంతే తప్ప ఏమీ పీకలేవు’

Perni Nani Sensational Comments On Pawan Kalyan And TDP - Sakshi

సాక్షి, తాడేపల్లి: దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ముసుగు తొలిగిపోయింది. ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరి ఉంది. చంద్రబాబుకు లబ్ధి కలిగించడమే పవన్‌ అంతిమ లక్ష్యం. సన్నాసి నాలుక చీరేస్తా.. అని నేను అనలేనా?. కానీ.. నాకు సంస్కారం అడ్డు వస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, పేర్ని నాని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుతో పవన్‌ చెట్టాపట్టాలు వేసుకుని తిరగడానికి సమయం దగ్గరపడింది. గూండాలు ఉన్నది పవన్‌ కల్యాణ్‌ పార్టీలోనే. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి.. ఎక్కడా పోటీ చేయకుండా వేరే వాళ్లకు ఓటు వేయమని చెబుతారా?. చంద్రబాబుకు అనుకూలంగా పొత్తులు పెట్టుకోవడాన్ని ప్యాకేజీ అనకుండా ఏమంటారు. నిన్నటి వరకు బీరాలు పలికిన దత్తపుత్రుడి ముసుగు తొలిగిపోయింది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ చంద్రబాబుకు అప్పగించడమే అంతిమ లక్ష్యమని మేము మొదటి నుంచి చెబుతున్నాము. సంతోషం.. ఈరోజు ముసుగు తీశాడు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాడు. 

రాజకీయ ముఖచిత్రం మారబోతోందంటే చంద్రబాబుతో కలిసి వెళ్తాడు. పవన్‌కు దమ్ముంటే 175 సీట్లకు పోటీ చేయాలి. పవన్‌.. 175 స్థానాల్లో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్‌ అని పిలవము. తిట్టిన నోటితోనే బీజేపీతో జట్టుకట్టారు. చంద్రబాబు కాళ్లు పిసకను, బూట్లు నాకను అని పవన్‌ చెప్పాలి. నిన్ను సోదరా అంటేనే అంత కడుపు రగిలితే.. నా కొడకల్లారా అంటే మాకు రగలదా?. ఒరేయ్‌ సన్నాసి నా కొడకా నాలుక చీరేస్తా అని నేను అనలేనా?. నీకు ఒక కాలికే చెప్పు ఉందేమో.. మాకు రెండు కాళ్లకు చెప్పులున్నాయి. చెప్పు తీసి సినిమా డైలాగులు చెబితే నీ నోటి తీట తీరుతుంది. అంతే తప్ప ఏమీ  పీకలేవు. నీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌సీపీ జడిసిపోదు. నీలాగా నాటుగా మాట్లాడే వారిని మేం వదిలితే చెవులు మూసుకోవాలి.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే పవన్‌ కల్యాణ్‌కు కోపం వస్తోంది. 2019లో కాపులు వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్నారు. 2024లో కూడా కాపులు అండగానే ఉంటారు’ అని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top