‘విశాఖలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’

Permanent Development Works In Visakha Minister Vidadala Rajini - Sakshi

విశాఖ:  విశాఖ నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి విడడల రజినీ స్పష్టం చేశారు. కేవలం జీ20 సదస్సు కోసం కాకుండా విశాఖ శాశ్వత అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి రజినీ. సీఎం జగన్‌ హయాంలో విశాఖ విశ్వఖ్యాతి గడిస్తోందని తెలిపారు. ఈ 28వ తేదీన జీ20 సదస్సుకు సీఎం జగన్‌ హాజరవుతారని మంత్రి రజినీ పేర్కొన్నారు. 

మంత్రి సురేష్‌ మాట్లాడుతూ..  విశాఖలో జీ20 సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. ‘రూ. 130 ​‍కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 600 కి.మీ మేర కొత్త రోడ్లు, మరమ్మత్తు పనులు. పరిపాలన రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులు జరిగాయి.రాబోయే రోజుల్లో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగనుంది.కొత్తగా 5 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top