పెనుమాక: అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకం చేయడం మంచిది కాదని గుంటురు జిల్లా పెనుమాక రైతులు.. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు అండగా నిలవడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషమన్నారు. రైతు పరిరక్షణ కమిటీకి తమ ఊరికి రావాలని ఆహ్వానించామని. వారిని టీడీపీ గూండాలు ఉండవల్లిలో అడ్డుకుని దాడులు చేశారరన్నారు. ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతి చూడలేదన్నారు.
మా బాధలు వినడానికి వైఎస్సార్‌సీపీ నేతలు వస్తే తప్పేంటి?, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేయడం మంచిది కాదు. రైతులకు అండగా ఉండటానికి వస్తే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయడం అమానుషం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు.
రాజధాని పేరుతో మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. మా పొలాల్లో రోడ్లు వేసి అక్రమంగా తవ్వుతున్నారు. భూములు ఇవ్వలేదన్న కక్షతో వాగు గట్టు తెంపేసి మా పొలాల్లోకి నీళ్లు వదులుతున్నారు. ఈ తరహా అరాచకం ఎప్పుడూ చూడలేదు’ అని పెనుమాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


