వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల పెన్‌డౌన్‌ | Pendown of medical department contract employees | Sakshi
Sakshi News home page

వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల పెన్‌డౌన్‌

Oct 5 2026 3:05 AM | Updated on Oct 5 2026 3:05 AM

Pendown of medical department contract employees

రేపు అత్యవసర సేవలు మినహా సేవలన్నీ నిలిపివేత

సాక్షి, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఆదివారం ఆస్పత్రుల్లో ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయకుండా పెన్‌డౌన్‌ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. సర్వీస్‌ రెగ్యులరైజేషన్, అది జరిగే వరకూ వంద శాతం గ్రాస్‌ వేతనం, ఇతర డిమాండ్లతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్థికేతర డిమాండ్లను నెలరోజుల్లో పరిష్కరిస్తామని ప్రభు­త్వం హామీ ఇచ్చింది. 

అయితే, గడువు ముగిసినా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం నుంచి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అలాగే, సోమవారం జిల్లా­ల్లో కలెక్టర్లకు వినతిపత్రాల అందజేత, మంగళవా­రం అత్యవసరం మినహా మిగిలిన సేవలన్నీ నిలిపివేత, బుధవారం నుంచి అత్యవసర సేవలనూ బహిష్కరించి సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని జేఏసీ హెచ్చరించింది.  

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి.. 
మరోవైపు.. కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులు, సూపరింటెండెంట్లకు వైద్యశాఖ ఆదివా­రం ఆదేశాలు జారీచేసింది. అవసరాన్ని బట్టి ఎంఎల్‌హెచ్‌పీలు, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఎంపీహెచ్‌­ఏ (ఎఫ్‌) సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించింది. ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సెలవుల మంజూరుపై నియంత్రణ పాటించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరును సిబ్బంది వాస్తవ హాజరుతో సరిపోల్చి పరిశీలించాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. సోమవారం మరోమారు చర్చలకు వైద్యశాఖ ఉన్నతాధికారులు తమను పిలిచినట్లు జేఏసీ కనీ్వనర్‌ అజయ్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement