బందరులో టీడీపీ నేతల అశ్లీల నృత్యాలు | Obscene dances by TDP leaders in Bandar | Sakshi
Sakshi News home page

బందరులో టీడీపీ నేతల అశ్లీల నృత్యాలు

Jul 14 2026 6:05 AM | Updated on Jul 14 2026 6:05 AM

Obscene dances by TDP leaders in Bandar

మహిళలతో నృత్యాలు చేస్తున్న టీడీపీ నేతలు

మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల బరితెగింపు  

అక్రమ దందాల సొమ్ముతో లాడ్జిలో జల్సాలు  

మద్యం మత్తులో యువతులతో కలిసి చిందులు  

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ 

విచారణకు ఆదేశించిన ఎస్పీ

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేతలు మట్టి అక్రమాలు, పేకాట శిబిరాలు, గంజాయి అమ్మకాలు, భూ దందాలతో చెలరేగిపోతున్నారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. లాడ్జిల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా నగరం నడిబొడ్డు ఉన్న ఓ లాడ్జిలో మద్యం తాగి యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్న టీడీపీ నేతల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులు ముగ్గురున్నారు. 

వీరు మద్యం మత్తు­లో ఊగిపోతూ యువతులతో అశ్లీల నృత్యాలు చేశా­రు. వీడియోల విషయం తెలుసుకున్న  ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు విచారణకు స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. రంగంలోకి దిగిన ఎస్‌బీ సిబ్బంది అశ్లీల నృత్యాలు చేసిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. మచిలీపట్నంలోని ఏ లాడ్జిని అద్దెకు తీసుకున్నారు? యువతులను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వీడియోలో కనిపించే టీడీపీ నేతలే కాకుండా పెద్ద నాయకులు ఇంకా ఏవరైనా ఉన్నారా? వంటి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement