‘చంద్రబాబువి పగటి కలలు’ | Minister Vellampalli Srinivas Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘జమిలి’ ప్రచారం

Sep 5 2020 2:25 PM | Updated on Sep 5 2020 3:52 PM

Minister Vellampalli Srinivas Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: జమిలి ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు పగటి కలలు కంటున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘టీడీపీ నాయకులను కాపాడుకొనేందుకే చంద్రబాబు జమిలి ఎన్నికలు అంటున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆయన జమిలి ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని’’ దుయ్యబట్టారు. (చదవండి: రైతుల‌పై కాల్పులు జ‌రిపించిన‌ చ‌రిత్ర చంద్ర‌బాబుది)

జమిలి ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని, 2024 షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఒక వేళ జమిలి ఎన్నికలు వచ్చిన తాము సిద్ధమని, జమిలి ఎన్నికలు వస్తే టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందన్నారు. ఇప్పుడున్న 23 సీట్లలో ఒకటి కూడా టీడీపీకి రాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదని, 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: ‘విద్యుత్‌’పై పేటెంట్‌ వైఎస్సార్‌దే)

Advertisement
 
Advertisement
Advertisement