త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు: ఆదిమూలపు | Minister Adimulapu Suresh Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు: ఆదిమూలపు

Jun 15 2021 6:04 PM | Updated on Jun 15 2021 7:56 PM

Minister Adimulapu Suresh Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘డీఎస్సీ-2008’ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇస్తామని మంత్రి తెలిపారు.

టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై త్వరలో నిర్ణయం..
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ఉండే అవకాశం ఉందన్నారు. జులై చివరి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సీఎంతో చర్చించి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

గత పాలకులు హామీ ఇచ్చి మోసగించారు: డీఎస్సీ అభ్యర్ధులు
గత పాలకులు హామీ ఇచ్చి మోసగించారని ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు  ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్లు మా జీవితాలు కోల్పోయేలా చేశారన్నారు. సీఎం జగన్ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారన్నారు. తమ కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు.

చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ 
థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు: ఏపీ సర్కార్‌ ముందస్తు ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement