మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 16వ రోజు షెడ్యూల్‌ | Memantha Siddham CM Jagan Bus Yatra April 16th Schedule | Sakshi
Sakshi News home page

మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 16వ రోజు షెడ్యూల్‌

Apr 15 2024 7:19 PM | Updated on Apr 16 2024 4:11 AM

Memantha Siddham CM Jagan Bus Yatra April 15th Schedule - Sakshi

సాక్షి,  పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం 16వ రోజు మంగళవారం (ఏప్రిల్ 16) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి  బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. 

అనంతరం  బయలుదేరి  భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
చదవండి: మేమంతా సిద్ధం 15వ రోజు: సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement