పెళ్లిలో భర్తతో డాన్స్‌.. కొన్ని గంటల్లోనే మృతి | Tragic Incident In Marriage At Dabbagadda Parvathipuram Manyam District, Know Details Inside - Sakshi
Sakshi News home page

పెళ్లిలో భర్తతో డాన్స్‌.. కొన్ని గంటల్లోనే మృతి

Mar 31 2024 5:56 AM | Updated on Mar 31 2024 11:22 AM

Marriage Tragic Incident In Dabbagadda Parvathipuram Manyam District - Sakshi

పెళ్లి ఊరేగింపులో భర్తతో కలిసి, చిరునవ్వు చిందిస్తున్న అఖిల

పార్వతీపురం మన్యం జిల్లా దబ్బగెడ్డలో పెళ్లింట విషాదం

మక్కువ: పెళ్లైన ఆనందంలో భర్తతో కలిసి డాన్స్‌ చేసి­న నవ వధువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిల(20)కు శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. మాంగల్యధారణ అనంతరం శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఊరేగింపు సాగింది. డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల డాన్స్‌ చేసింది. అనంతరం నీరసంగా ఉం­దం­టూ నిద్రలోకి జారుకుంది.

తర్వాత బంధువులు వెళ్లి లేపగా, ఎంతకూ లేవకపోవడంతో వెంటనే మక్కు­వ పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సాలూరు సీహెచ్‌సీకు తరలించారు. అక్కడి వైద్యు­లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది. ముందు రోజు ఉపవాసం ఉండటం, పెళ్లి తర్వాత డాన్స్‌ వేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉండవచ్చునని గ్రామస్తులు, బంధువులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement