
అన్నమయ్య జిల్లా : రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట నందలూరు పోలీసులను ఆశ్రయించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని టంగుంటూరు గ్రామానికి చెందిన చలమాల నవీన్ కుమార్, పులివెందుల మండలం భాకరపురం గ్రామానికి చెందిన సయ్యద్ మనీషా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరు మేజర్లు కావడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చి రాజంపేట సమీపంలోని పోలిచెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంనంతరం తమ బంధువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తమను ఆశ్రయించారని ఎస్‌ఐ తలెఇపారు. ఇరువురి కుటుంబీకులను పిలిపించి ఘర్షణలకు పాల్పడకుండా సామరస్యంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.