తిరుమల, ఎస్వీ యూనివర్సిటీలో చిరుతల సంచారం | Leopard Movement At Tirumala And SV university | Sakshi
Sakshi News home page

తిరుమల, ఎస్వీ యూనివర్సిటీలో చిరుతల సంచారం

Jan 31 2025 7:28 AM | Updated on Jan 31 2025 7:31 AM

Leopard Movement At Tirumala And SV university

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.

వివరాల ప్రకారం.. ఎస్వీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లింది. దీంతో, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్ , హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే, గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.

ఇక, తిరుమలలో కూడా చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement