భారంగా వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

భారంగా వ్యవసాయం

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

మాది రామచంద్రాపురం. ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయం కొనసాగించలేకపోతున్నాం. పల్లెలో రైతు బతుకు కష్టంగా మారింది. రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేపరిస్థితి లేదు. –అర్జున్‌రెడ్డి, రామచంద్రాపురం, చంద్రగిరి

కరువైన ఉపాధి

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థి తి దారుణంగా మారాయి. ఉపాధి దొరకడం లేదు. ప్రభుత్వ పథకాల జాడలేదు. వ్యవసాయానికి పెట్టుబడి అందడం లేదు. ప్రతి ఒక్క వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది.

– చంద్రశేఖర్‌, తిరుపతి రూరల్‌ మండలం

పథకాల ఊసేలేదు

మాది వెంకటగిరి. గత ప్రభుత్వంలో మా కుటుంబానికి ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద నగదు వచ్చేది. నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పల్లెల్లో ప్రభుత్వ పథకాల ఊసేలేదు. నిత్యావసర సరులు కొనే పరిస్థితిలేదు.–రామతులసి, వెంకటగిరి

కొత్త పింఛన్లు ఎక్కడ

మాది తిరుపతి రూరల్‌. గత రెండేళ్లుగా వితంతు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నా. పలు మార్లు దరఖాస్తులు ఇచ్చా. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇదిగో అదిగో అంటూ రెండన్నరేళ్లు గడిపేశారు. – లలితమ్మ, తిరుపతి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement