ఆగమ శాస్త్రాలే ప్రామాణికం | - | Sakshi
Sakshi News home page

ఆగమ శాస్త్రాలే ప్రామాణికం

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

తిరుమల: దేవాలయ ఆరాధనా విధానాలు, భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆగమ శాస్త్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పండితులు పేర్కొన్నారు. కార్తీక మాస శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని అత్రి మహర్షి జయంతి కార్యక్రమాన్ని సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆల్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ, వైఖానస భగవచ్ఛాస్త్రం దేవాలయ ఆరాధనా విధానాలకు ప్రామాణికమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయం ఆచరణలో ఉందన్నారు. తిరుమలలో నిర్వహించే పుష్పయాగం కూడా వైఖానస ఆరాధనా విధానంలోని ప్రాయశ్చిత్త ప్రక్రియలో భాగమని వివరించారు. ఈ కార్యక్రమానికి వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి దీవి శ్రీనివాస దీక్షితులు అధ్యక్షత వహించగా, టీటీడీ ఆగమ సలహాదారులు అర్చకం అనంతశయన దీక్షితులు, ఖాద్రీ నరసింహాచార్యులు, విఖనస ట్రస్ట్‌ కార్యదర్శి జి.ప్రభాకరాచార్యులు తదితర పండితులు, వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement