ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలం పల్లం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి.అక్షయ జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం తీగల ఆనంద్ సోమవారం తెలిపారు. విజయవాడ గన్నవరంలో ఈనెల 14, 15 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ జూడో చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో పి.అక్షయ గోల్డ్ మెడల్ సాధించి, డిసెంబర్ 12 నుంచి 16 తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి జూడో చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై నట్లు వివరిచారు. ఈనెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగబోయే జూడో నేషనల్ మీట్‌లోనూ విద్యార్థిని పాల్గొంటుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న అక్షయను సోమవారం పాఠశాల ఆవరణలో హెచ్‌ఎం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వ్యాయమ ఉపాధ్యాయులు వాణి, శోమశేఖర్‌ను అభినందించారు.
పిల్లలను సాకలేకపోతే అప్పగించండి
తిరుపతి అర్బన్: ‘మీ పిల్లలను పెంచలేకపోతే.. మీకు ఇష్టం లేకుంటే మాకు అప్పగించండి’ అని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వసతంబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం వరదయ్యపాళెం ప్రాంతంలో ఓ చిన్నారిని వదిలిపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఆ చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. మీ పిల్లలను పెంచుకోలేకపోతే ఐసీడీఎస్ వారికి అప్పగిస్తే తిరుపతి ఎమ్మార్ పల్లిలోని శిశుగృహంలో సురక్షితంగా పెంచుతామని పేర్కొన్నారు.
మెడికల్ ఎంప్లాయీస్ జిల్లా కమిటీ ఎంపిక
తిరుపతి కల్చరల్: ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. యూత్ హాస్టల్లో సోమవారం జరిగిన యూనియన్ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కార్‌రావు హాజరై జిల్లా నూతన కమిటీని ఎంపికచేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నగౌని తులసీరామ్, ప్రధాన కార్యదర్శిగా ఎం.ఉమా సుబ్బరాజు, ఉపాధ్యక్షులుగా జె.రత్నాకర్‌రావు, ఎస్.రామకృష్ణ, బి.నరేష్‌కుమార్, ఎ.రుక్ష్మిణి, ఎ.గిరిజమ్మ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.మునిలక్ష్మి, సహాయక కార్యదర్శులుగా జి.రఘు, కె.నారాయణరాజు, ఎం.సుబ్రమణ్యం, పి.వసుంధర, జె.శివశంకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్‌రావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమానపనికి సమాన వేతనం, రెండో ఏఎన్‌ఎంలకు జీతాల పెంపు, డిపార్ట్‌మెంట్‌లోని ఖాళీల భర్తీ, మొబైల్ యాప్‌ల పనిభారం తగ్గింపు వంటివాటిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ వేదిక సెక్రటరీ జనరల్ శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రమణ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


