
సాక్షి, విశాఖపట్నం: ఉక్కు ఉద్యమంపై(Vizag Steel Plant Movement) కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగా.. సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా.. యూనియన్ నేతలపై కేసులు బనాయించడంతో కార్మికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్(VSP) అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి ప్రయత్నించారంటూ 8 మంది కార్మిక నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో.. వైఎస్సార్‌సీపీ హయాంలోనూ యూనియన్లు ఉద్యమాలు, రాస్తారోకోలు చేశాయి. కానీ, ఆ టైంలో ఏ ఒక్కరి మీదా కేసులు పెట్టలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam)లో ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టడం గురించి కార్మికులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఈ రిమార్క్ ఎవరిది లోకేశా?