హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు | home minister vangalapudi anitha sensational comments on law and order in ap | Sakshi
Sakshi News home page

హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

Jul 18 2024 6:48 PM | Updated on Jul 18 2024 7:39 PM

home minister vangalapudi anitha sensational comments on law and order in ap

 సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతాభావ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌పై ప్రశ్నించిన మీడియాపై ఆమె అసహనం ప్రదర్శించారు. 

‘మీరు హోంమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా?’ అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘నన్నేం చేయమంటారు?. నేనే లాఠీ పట్టాలా..? గన్ పట్టాలా?. దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా. దేనికైనా టైం పడుతుంది’’ అని అన్నారామె. 

ఇక.. నెలకు పైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఓ వైపు వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. హత్యలు, వేధింపుల పర్వాలు, చిన్నారులతో సహా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement