బాబొచ్చాక నేల చూపులే.. ఏపీలో మళ్లీ పడిపోయిన జీఎస్టీ ఆదాయం | GST Revenue Falls Again In Andhra Pradesh During Kutami Government Regime, More Details Inside | Sakshi
Sakshi News home page

బాబొచ్చాక నేల చూపులే.. ఏపీలో మళ్లీ పడిపోయిన జీఎస్టీ ఆదాయం

Jun 1 2025 4:20 PM | Updated on Jun 1 2025 5:34 PM

Gst Revenue Falls Again In Andhra Pradesh

సాక్షి, విజయవాడ: సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఉన్న సంపదను కూడా నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ ఆదాయం మళ్లీ పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో క్షీణతలే నమోదవుతున్నాయి.

మే నెలలోనూ 2 శాతం జీఎస్టీ ఆదాయం మైనస్ అయ్యింది. గత ఏడాది మే ఆదాయం కంటే.. ఈ ఏడాది మే నెలలో తక్కువ ఆదాయం నమోదైంది. చంద్రబాబు పాలనలో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన జీఎస్టీ ఆదాయం.. చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రమే తగ్గింది.

మే లో 3,803 కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా.. గత ఏడాది మే నెలలో 3,890 కోట్లు జీఎస్టీ ఆదాయం వచ్చింది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ ఆదాయం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జీఎస్టీ ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం పతనమైంది. చంద్రబాబు సీఎం అయ్యాక అత్యధిక మాసాలు ఆదాయం పతనమైంది. చంద్రబాబు పాలన వైఫల్యానికి ఇది నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement