ఆర్టీసీ ప్రై‘వేటు’కు రైట్‌ రైట్‌! | Green flag for first phase of RTC privatization under the guise of e buses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రై‘వేటు’కు రైట్‌ రైట్‌!

Jun 24 2026 4:51 AM | Updated on Jun 24 2026 4:51 AM

Green flag for first phase of RTC privatization under the guise of e buses

ఉద్యోగ సంఘాల ఆందోళన బేఖాతరు చేసిన చంద్రబాబు సర్కారు

ఇ–బస్సుల ముసుగులో ప్రైవేటీకరణకే మొగ్గు

తొలి దశలో 1,450 ఇ–బస్సులు– డిపోలవారీగా ఆమోదించిన ఆర్టీసీ  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగ సంఘాల ఆందోళనను సైతం బేఖాతరు చేసింది. ఇ–బస్సుల ముసుగులో ఆర్టీసీ ప్రైవేటీకరణ తొలి దశకు పచ్చజెండా ఊపింది. తొలి దశలో 1,450 ఇ–బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. 

ఈ మేరకు డిపోల వారీగా ప్రవేశపెట్టనున్న ఇ–బస్సుల వివరాలను ఖరారు చేస్తూ రీజనల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 29 డిపోల్లో 1,450 ఇ–బస్సులను ప్రవేశపెట్టబోతోంది. దశలవారీగా మొత్తం 11 వేల బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించడమే తమ విధానమని తేల్చిచెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement