విశాఖ బీచ్‌ సూపర్‌ | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌ సూపర్‌

Published Wed, Feb 7 2024 5:46 AM

Former England cricketer is in awe of RK Beach beauty - Sakshi

విశాఖ సిటీ: విశాఖ ఆర్‌కే బీచ్‌ అందానికి ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ ఫిదా అయ్యాడు. భారత్‌లో తాను చూసిన బీచ్‌లలో రామకృష్ణ బీచ్‌ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్‌–ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ కోసం హార్మిసన్‌ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్‌ చివరి రోజు ఆర్‌కే బీచ్‌ను సందర్శించాడు.

హార్మిసన్‌ యూకేకు చెందిన టాక్‌స్పోర్ట్స్‌ చానల్‌తో మాట్లాడుతూ భారత్‌లో తాను అనేక బీచ్‌లను సందర్శించానని, విశాఖ ఆర్‌కే బీచ్‌ ఉన్నంత క్లీన్‌గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్‌ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్‌ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్‌ ప్రశంసించాడు.

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో...
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్‌ చేపడుతోంది.

గతంలో లేని విధంగా కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్‌లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్‌లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్‌ సర్టిఫికేషన్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement