సింహాచలం: ప్లాస్టిక్‌ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), ఏయూ ఆర్‌ఎస్‌ఎస్ విభాగం, ఖే లో భారత్ సంస్థ సంయుక్తంగా ఆదివారం మాధవధార నుంచి సింహాచలం కొండపైకి ట్రెకింగ్ నిర్వహించాయి. సుమారు వంద మంది విద్యార్థులు ఈ ట్రెకింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ప్రేమించా లనే ఉద్దేశంతో ప్లాస్టిక్‌ను నిషేధించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ట్రెకింగ్ మార్గ మధ్యలో పడి ఉన్న ప్లాస్టిక్ బా టిళ్లు, కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి పర్యావరణ స్పృహను చాటారు. అనంతరం సింహగిరికి చేరుకున్న విద్యార్థి బృందాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అభినందించారు. ఖేలో భారత్ కన్వీనర్ విజయ్, సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు.


