తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కేకే లైన్ పరిధిలో నూతనంగా నిర్మించిన రెండో లైన్ పనులను ఆదివారం కమిషనర్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) బ్రజేష్‌కుమార్ మిశ్రా తనిఖీ చేశారు. కేకే లైన్‌లో కరకవలస–సిమిలిగూడ మధ్య నూతనంగా నిర్మించి, విద్యుద్దీకరణ పూర్తిచేసిన 9 కిలోమీటర్ల లైన్‌ను, ఈ మార్గంలోని పెద్ద, చిన్న బ్రిడ్జిలు, వంతెనలు, మలుపులను ఆయన పరిశీలించారు. ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. తనిఖీల్లో డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్‌స్ట్రక్షన్) అంకుశ్‌గుప్తా, చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ అశోక్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ /కన్‌స్ట్రక్షన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ సిగ్నల్ ఇంజినీర్, డిప్యూటీ సీఆర్‌ఎస్, అధికారులు పాల్గొన్నారు.


