తొలగించిన ఓటర్లపై నేడు ఇంటింటి సర్వే | Final voter list to be released on the 16th of this month | Sakshi
Sakshi News home page

తొలగించిన ఓటర్లపై నేడు ఇంటింటి సర్వే

Oct 8 2026 4:23 AM | Updated on Oct 8 2026 4:23 AM

Final voter list to be released on the 16th of this month

సర్‌లో 46,62,583 మంది ఓటర్ల తొలగింపు

ఈనెల 16న తుది ఓటర్ల జాబితా విడుదల

కొత్త ఓటర్లు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్‌)పై వివాదం తీవ్రమవుతున్న తరు­ణంలో రాష్ట్రంలో తొలగించిన ఓటర్లను మరోసారి పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని, అలాగే అర్హత లేని వారికి ఓటు హక్కు ఉండకూ­డదన్నది కేంద్ర ఎన్నికల సంఘ నినాదమని, ఇందులో భాగంగా సర్‌లో తొలగించిన ఓటర్లను ఇంటి­ంటి సర్వే ద్వారా మరోసారి పరిశీలించాలని ఆదే­శించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సర్‌ ఇంటింటి సర్వేలో ఆచూకీ దొరకని 44,89,512 మంది ఓట­ర్లను తొలగించడం జరి­గిందని, అలాగే వివరాలు సరిగా లేవని నోటీసులు జారీచేసి విచారణ తర్వాత మరో 1,73,071 మంది కలిపి మొత్తం 46,62,583 మంది ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు. ఈ తొలగించిన ఓటర్ల ఇళ్లకు గురువారం బీఎల్‌వోలు వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

ఫారం–6 ద్వారా తిరిగి నమోదు
ఈ సర్వేలో ఎవరి ఓటు అయినా తొలగించినట్లు గుర్తిస్తే, తిరిగి ఫారం 6 ద్వారా నమోదు చేయ­ను­న్నట్లు తెలిపారు. ఈనెల 16న తుది ఓటర్ల జాబి­తాను విడుదల చేస్తామని, వచ్చే ఏడాది జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత ఉందన్నారు. ఒకవేళ తుది ఓటర్ల జాబితా విడు­దలలో వీరి పేర్లు లేకపోతే ఫారం–6 ద్వారా ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకునే హక్కు ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని సీఈవో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement