Fact Check: కుప్పం ప్ర'జల నవ్వుల'పై కుళ్లు రాతలు!

Eenadu Ramoji Rao Fake News On Kuppam People - Sakshi

కృష్ణా జలధారలు కనిపించట్లేదా!

ఇప్పటికే రెండు చెరువులకు నీళ్లు 

ప్రారంభోత్సవ డెకరేషన్‌ సామగ్రి మాత్రమే తొలగింపు 

అయినా నిస్సిగ్గుగా కథనం

సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్ను­కుం­టున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధి­నేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపో­యి­నా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకు­న్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహి­స్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్‌ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సి­గ్గుగా ‘కుప్పం ఫక్కున నవ్వింది’ అంటూ ఏడుపు­గొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది.  

నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్‌ రామోజీ!
కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పుంగనూరు బ్రాంచ్‌ కె­నాల్‌ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్ట­ణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలు­స్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కో­ట్లు­­గా నిర్ణ­యించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైద­రాబాద్‌కు చెందిన ఆర్‌కే హెచ్‌ఈఎస్‌–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్‌ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది.

నాడు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌కు ఎయిర్‌ రిలీఫ్‌ వాల్యూమ్‌లు, స్కోర్‌ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్‌లైన్‌ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్‌ డిజైన్, ఎస్‌ఎల్‌ఆర్‌బీ, డీఎల్‌­ఆర్‌బీ, పైప్‌ కల్వర్ట్‌ క్రాస్‌ వర్క్‌లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్‌ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్‌లైన్‌ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.   

జగన్‌ చెబితే చేస్తారంతే..
సీఎం జగన్‌ 2022 సెప్టెంబర్‌ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్‌ కెనాల్‌ పనులపై స్థానికులు ఆయనకు ఫి­ర్యా­దు చేశారు. దీంతో పెండింగ్‌ పనులు పూర్తి­చేసి త్వరలో కృష్ణాజ లాలను  తీసు కువ­స్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్‌ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్‌కు చెందిన ప్రముఖ ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి పనులను అప్పగించింది.

సాంకేతిక నిపుణుల కమిటీ సూ­చనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్‌ రిలీఫ్‌ వాల్యూ మ్‌ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎ యిర్‌ వాల్యూమ్‌­లను ఏర్పాటు చేయాలని సూ చించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్‌లైన్‌ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తి­చేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడు­వున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.  

కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు
మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను వి­డుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం)  శాంతిపురం మండలం వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్‌ రన్‌లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు.

అప్పటికే అధికారులు ట్రయల్‌ రన్‌ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్‌పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్‌ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మల్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు.

ఆ తరువాతే అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవ నరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్‌లు, డెకరేషన్‌లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది.  

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా.. 
► పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్‌ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు.
► 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు
► వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్ట్‌లు
► కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు 
► 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు  
► అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్‌ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు  

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top