Covid Vaccination In Andhra Pradesh: 7,598 మందికి వ్యాక్సిన్ - Sakshi
Sakshi News home page

7,598 మందికి వ్యాక్సిన్

Jan 28 2021 5:36 AM | Updated on Jan 28 2021 9:52 AM

Corona Vaccination For 7589 People In AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా బుధవారం 7,598 మందికి వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో కోవిషీల్డ్‌ (సీరం కంపెనీ) వ్యాక్సిన్‌ 6,619 మందికి వేయగా, కోవాగ్జిన్‌ (భారత్‌ బయోటెక్‌ కంపెనీ) వ్యాక్సిన్‌ను 979 మందికి వేశారు. ఈ టీకా ప్రక్రియలో 8 మంది స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 839 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ చేపట్టారు.

ఏపీలో 111 పాజిటివ్‌ కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,808 పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ 1,29,75,961 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. ఒకేరోజు 97 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,78,828కి చేరింది. తాజాగా ఇద్దరి మృతితో మొత్తం మరణాలు 7,152కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 1,369 ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement