నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..  | CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule on April 12th | Sakshi
Sakshi News home page

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. 

Apr 12 2024 5:03 AM | Updated on Apr 12 2024 5:03 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule on April 12th - Sakshi

ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం   

హౌసింగ్‌ బోర్డు వద్ద భోజన విరామం 

సాయంత్రం గుంటూరులో ఏటుకూరు బైపాస్‌ వద్ద బహిరంగ సభ  

నంబూరు బైపాస్‌ వద్ద రాత్రి బస  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజైన శుక్రవారం(ఏప్రిల్‌ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ బుధవారం రాత్రి బస చేసిన ధూళిపాళ్ల ప్రాం­తం దగ్గర నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.

సత్తెనపల్లి, కొర్రపా­డు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్‌ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టు­గుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్‌ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement