తాజాగా మరో రూ.3,800 కోట్లు రుణం.. సంపద సృష్టి లేదు.. సంక్షేమానికి తూట్లు
సూపర్ సిక్స్‌లు, హామీలు గాలికి.. నిత్యం చేబదుళ్లు, ఓడీలతోనే పాలన
సాక్షి, అమరావతి: అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా ఈమేరకు అప్పులు చేసింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరాయి. ఇన్ని అప్పులు చేసినా సంక్షేమం, అభివృద్ధిని అటకెక్కించింది.
కొత్తగా సంపద సృష్టించకపోగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు పనులతో ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తోంది. సూపర్ సిక్స్ ప్రధాన హామీలను సైతం అమలు చేయకపోగా గత ప్రభుత్వం ఇ చ్చిన పథకాలను సైతం రద్దు చేసింది. రెండేళ్ల పాలనలో అప్పుల మీద అప్పులు చేస్తున్నా హామీల ఊసు విస్మరించింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు. సంపద సృష్టీ లేదు.
ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు అప్పులు చిట్టా: రూ.3,59,157 కోట్లు
బడ్జెట్ అప్పులు: రూ.1,98,666 కోట్లు
బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పులు: రూ.1,13,104 కోట్లు
రాజధాని అప్పులు: రూ.47,387 కోట్లు


